పచ్చబొట్ల వల్ల HIV, హెపటైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉందట. రసాయనాలు కలిపిన పచ్చ ద్రావణం చర్మ పొరల్లోకి, నరాల్లోకి చేరి అనేక రోగాలకు కారణమవుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, అపరిశుభ్రమైన చోట్ల పచ్చబొట్లు వేయించుకుంటే, అందం కోసం ఆరాటపడి ఆరోగ్యాన్ని పణంగా పెట్టినట్లే అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.