పిల్లలను ఎత్తుకెళ్తున్న ముఠాను పట్టుకున్నాం: సీపీ

81చూసినవారు
పిల్లలను ఎత్తుకెళ్తున్న ముఠాను పట్టుకున్నాం: సీపీ
పిల్లలను ఎత్తుకెళ్తున్న ముఠాను పట్టుకున్నామని సీపీ తరుణ్ జోషీ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..‘‘ నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లు సమాచారం వచ్చింది. పిల్లలు లేని వారికి ఈ పిల్లలను అమ్ముతున్నట్లుగా తెలిసింది. ఇటీవల మేడిపల్లిలో శోభా రాణి, సలీం, స్వప్నలను అరెస్టు చేశాం’’ అని సీపీ వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించామన్నారు.

సంబంధిత పోస్ట్