కవిత అరెస్ట్‌పై CBI అధికారిక ప్రకటన

62458చూసినవారు
కవిత అరెస్ట్‌పై CBI అధికారిక ప్రకటన
లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్‌పై సీబీఐ అధికారిక ప్రకటన చేసింది. ‘‘తీహార్ జైల్లో ఉన్న కవితను అరెస్ట్ చేశాం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అరెస్ట్ చేస్తున్నట్లు జైలు అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చాం. ఐపీసీ సెక్షన్ 477, 120(B), పీసీ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేశాం. జైలు అధికారుల ద్వారా అరెస్ట్ చేసిన సమాచారం పంపించాం’’ అని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు.

సంబంధిత పోస్ట్