ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ చట్టానికి సవరణలు చేసి, తద్వారా వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేసేందుకు సిద్ధంగా ఉందని జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చట్టంలోని సవరణలకు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా, ఈ నిర్ణయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. వక్ఫ్ ఆస్తులకు బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉందని అన్నారు.