చార్‌ధామ్ యాత్రకు వచ్చిన భక్తులు తీవ్ర అవస్తలు ఎదుర్కొంటున్నారు. ఇసుకేస్తే రాలనంత జనం ఉండటంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తి ప్రాణాలు కోల్పోతున్నారు. యాత్ర ప్రారంభమైన 12 రోజుల్లోనే 42 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో కేదార్‌నాథ్‌లోనే 19 మంది చనిపోగా, యమునోత్రిలో 12 మంది, బద్రీనాథ్‌లో తొమ్మిది మంది, గంగోత్రిలో ఇద్దరు భక్తులు మరణించారు.