ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు

82చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు. సిట్ దర్యాఫ్తు బృందం కస్టడీలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తమను రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేశారని నాంపల్లి కోర్టును నిందితులు కోరారు. బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. కేసు రేపటికి వాయిదా పడింది.

సంబంధిత పోస్ట్