TG: హైదరాబాదు నగరంలోని వనస్థలిపురంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి నివాసం ఉంటున్న ఓ మహిళ తన భర్త సోమ సుందరాన్ని మోసం చేసి రూ.60 లక్షలతో మాజీ ప్రియుడు భాను ప్రకాశ్ తో పారిపోయింది. మొదట ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని, ఆ తర్వాత డబ్బులు తీసుకుని ఆ మహిళ పారిపోయిందని సుందరం వాపోయారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.