ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని, సబ్సిడీ రూపంలో అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అందులో భాగంగా, లీటర్ పెట్రోల్, డీజిల్‌ను కేవలం రూ.55కే అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ సబ్సిడీ ప్రయోజనాలు కేవలం దివ్యాంగులకు మాత్రమే వర్తిస్తాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.