అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా తగ్గిపోవడంపై కేంద్రాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ నిలదీశారు. రూపాయి విలువ తగ్గిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీని ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. శుక్రవారం రూపాయి విలువ 16 పైసలు క్షీణించి చరిత్రలోనే తొలిసారి 86.04కి చేరుకోవడంతో రూపాయి పతనంపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.