ఆన్‌లైన్‌లో మోసపోయిన వారు ఘటన జరిగిన 3 రోజులలో బ్యాంకుకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. ఎలా అంటే.. అదే రోజు సమీపంలోని పిఎస్ లో రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అలాగే FIR నమోదు చేసుకోవాలి. అది సాధ్యం కాకపోతే ఫిర్యాదు చేసినట్లు రశీదు తీసుకోవాలి. మోసం జరిగిన తీరును లేఖలో రాసి, దాంతో పాటు పిఎస్ లో ఇచ్చిన రశీదును జత చేసి బ్యాంకులో సమర్పించాలి. RBI ఈమెయిల్ ఐడీ crpc@rbi.org.inకి 2 కాపీలను పంపాలి. దానిలో మీ బ్యాంక్ ఈమెయిల్ IDని చేర్చాలి.