రోజూ ఉదయం పరగడుపున అల్లం రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అల్లం రసం క్రమం తప్పకుండా తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. బెల్లీ ఫ్యాట్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. శరీరంలో అదనంగా పేరుకుని ఉండే కొవ్వు కరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కండరాల నొప్పి వంటి సమస్యల్ని తగ్గిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.