చెన్నై వర్సెస్ బెంగళూరు.. పైచేయి ఎవరిది?

60చూసినవారు
చెన్నై వర్సెస్ బెంగళూరు.. పైచేయి ఎవరిది?
IPL-2025లో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్‌లో CSK-RCB జట్లు ఇప్పటివరకు 33 సార్లు తలపడ్డాయి. కాగా ఇందులో చెన్నై జట్టే ఎక్కువ సార్లు నెగ్గి పైచేయి సాధించింది. ఏకంగా 21 మ్యాచుల్లో ఆర్సీబీపై చెన్నై గెలుపొందింది. ఆర్సీబీ చెన్నైని కేవలం 11 మ్యాచుల్లోనే ఓడించింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు.

సంబంధిత పోస్ట్