నటి సమంత ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో సందడి చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న భారతీయ చలన చిత్రోత్సవం కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. సిడ్నీ పర్యటన సందర్భంగా అక్కడి యువతతో ఆమె మాట్లాడుతూ.."నా జీవితంలో నాకు నచ్చినట్లు బతకాలని అనుకుంటున్నా. రూల్స్ నాకు నచ్చవు. నాకు ఇష్టమైన రంగాల్లో రాణించాలన్నదే నా కోరిక. ఆడపిల్ల కాబట్టి ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఆంక్షలు విధిస్తే నాకు నచ్చదన్నారని అని"సమంత అన్నారు.