యజమాని చెప్పినట్లు వింటున్న కోడి.. (Viral video)

75చూసినవారు
ఓ కోడి యజమాని చెప్పినట్లు వింటోంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి అనే వ్యక్తికి కోళ్లఫాం ఉంది. అయితే ఆ ఫారంలో ఓ కడక్ నాథ్ కోడి యజమాని చెప్పినట్లు చేసి అందరిని షాక్ కు గురిచేస్తోంది. వెనక్కి రమ్మంటే వెనక్కి.. ముందుకు వెళ్లమంటే ముందుకు వెళ్తోంది. కోడి యజమాని మాట్లాడుతూ.. ఆ కోడికి తానంటే ఇష్టమని తన చుట్టే తిరుగుతూ చెప్పినట్లు వింటుందన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్