తమిళనాడులో ఘోర ప్రమాదం..ఐదుగురు మృతి

67చూసినవారు
తమిళనాడులో ఘోర ప్రమాదం..ఐదుగురు మృతి
తమిళనాడులోని సేలంలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు నుజ్జునుజ్జు అయ్యారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితులు ఓ ట్రక్కు వెనుక రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్నారు. అయితే ముందు స్పీడ్ బ్రేకర్ రాగానే.. లారీ డ్రైవర్ వేగాన్ని తగ్గించాడు. అది గమనించిన బైకర్లు కూడా వేగం తగ్గించారు. అయితే వెనుకాల వస్తున్న ప్రైవేట్ బస్సు వారిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్