వాలంటీర్‌ వ్యవస్థ రద్దు కాలేదు: మంత్రి నిమ్మల

79చూసినవారు
వాలంటీర్‌ వ్యవస్థ రద్దు కాలేదు: మంత్రి నిమ్మల
AP: రాష్ట్రంలో వాలంటీర్‌ వ్యవస్థ ఇంకా రద్దు కాలేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. "కేవ‌లం ఎన్నికల సమయంలో తాత్కాలికంగా వారిని విధులకు దూరం పెట్టారు. వాలంటీర్లు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వ్య‌క్తులు. త్వరలోనే ప్రభుత్వం ఈ వ్యవస్థపై సమీక్ష నిర్వహిస్తుంది. వాలంటీర్ల‌ను ప్రజాసేవ కోసం వినియోగించుకుంటుంది. ప్రజలకు ఇంటి వద్దే పెన్ష‌న్ అందించే ప్రయత్నం చేస్తున్నాం." అని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్