చైనా వైద్యులు ప్రపంచ వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. జన్యు మార్పులు చేసిన పంది కాలేయాన్ని మానవునికి అమర్చి విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన మనిషి శరీరంలో పంది కాలేయాన్ని అమర్చినట్లు చైనా వైద్యులు ప్రకటించారు. భవిష్యత్తులో రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఈ ప్రయత్నం దోహదపడుతుందని భావిస్తున్నారు. గతంలో అమెరికా వైద్యులు కూడా పందుల శరీర అవయవాలను మనుషులకు అమర్చారు.