పెళ్లి బరాత్ అంటే మాములుగా వధువు, వరుడు కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇంకా వారికి సంబంధించిన పేరెంట్స్‌తో, బంధువులతో కలిసి డ్యాన్స్ చేస్తారు. కానీ ఓ వరుడు తన పెళ్లి బరాత్‌లో ఓ శునకంతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇలాంటివి చాలా అరుదుగా కనిపించినా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. కాగా, ఇది ఎక్కడ, ఎప్పుడో జరిగిందో తెలియరాలేదు.