ప్రతిష్టాత్మక సింగపూర్ సాహిత్య పురస్కారాన్ని భారత సంతతి రచయిత్రి ప్రశాంతి రామ్ గెలుచుకున్నారు. ఈమె రచించిన 'నైన్ యార్డ్ శారీస్'కు ఈ పురస్కారం లభించింది. ఈమె తొలి రచన ఇదే. రెండేళ్లకు ఒకసారి ఈ పురస్కారాన్ని అందిస్తారు. చైనీస్, ఇంగ్లిష్, మలయ్, తమిళ భాషల్లో రచనలు చేసే సింగపూర్ రచయితలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు.