బెస్ట్ కంట్రీస్ ఫర్ 2024' అనే సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది. సాహసం, చురుకుదనం, వారసత్వం, వ్యవస్థాపకత, జీవన నాణ్యత, సాంస్కృతిక ప్రయోజనం వంటి 10 విభిన్న ప్రమాణాలను ఉపయోగించి 89 దేశాలకు ఈ సర్వే ర్యాంకులు ఇచ్చింది. ఈ దేశం ఈ ఘనత సాధించడం ఇది వరుసగా మూడోసారి. జపాన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో నిలిచాయి. భారత్ 33వ స్థానంలో నిలిచింది.