AP: బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాతలకు శుభవార్త అందించారు. ప్రతి సంవత్సరం మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 6 వేలతో కలుపుకుని మొత్తంగా రూ. 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మన అప్పులు పెట్టి వెళ్లిపోయింది. సంపద సృష్టించాలి.. ఆదాయం పెంచాలని సీఎం పేర్కొన్నారు.