చలికాలం వచ్చిందంటే చాలు.. చాలామందికి పెదవులు పగులుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. తరచుగా పెదవులు పగిలినప్పుడు లేదా పొడిగా ఉన్నప్పుడు నాలుకతో పెదవులపై రుద్దకూడదు. ఇలా చేస్తే పెదవులకు హానికరం. ధూమపానానికి దూరంగా ఉండాలి. పెదవులు మృదువుగా మారాలంటే నెయ్యిని ఉపయోగించవచ్చు. నెయ్యి పొడి, పగిలిన పెదవుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇంకా పుష్కలంగా నీరు త్రాగడం వల్ల పెదవులు తడిగా ఉంటాయి.