భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా పింక్ బాల్ డే/నైట్ మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు ఆట కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. కమిన్స్ వేసిన 3.5 ఓవర్‌కు కేఎల్ రాహుల్ (7) ఔటయ్యాడు.
షాట్ ఆడబోయి వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. మిచెల్ స్టార్క్ వేసిన మొదటి ఓవర్‌లో యశస్వి జైస్వాల్ బౌండరీ రాబట్టాడు.