కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ బుధవారం నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు బయలుదేరి వెళ్లారు. రేపు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే వంటి నేతలు హాజరు కానున్నారు.