ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు దసరా ఆదాయం రూ.9.31 కోట్లు

77చూసినవారు
ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు దసరా ఆదాయం రూ.9.31 కోట్లు
విజయవాడ దుర్గగుడికి దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారీ ఆదాయం సమకూరింది. దాదాపు రూ.9.31 కోట్లు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. మూడు విడతలుగా లెక్కించిన వివరాలను ప్రకటించారు. మొదటి విడతగా లెక్కించిన హుండీలో రూ.3.50 కోట్లు, రెండో విడతలో రూ.2.76 కోట్లు, మూడో విడతలో రూ.3.05 కోట్లు కానుకల రూపేణా వచ్చినట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు. వీటితో పాటు 733 గ్రాముల బంగారం, 25.705 కిలోల వెండిని భక్తులు సమర్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్