కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలోని నితిన్ గడ్కరీ కార్యాలయానికి వెళ్లి.. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు గాను కేంద్ర మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.