TG: సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ జ్యురిచ్, స్విట్జర్లాండ్ ఎయిర్‌పోర్టులలో తనకు లభించిన స్వాగతాన్ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎంతో మంది విద్యావంతులు, పారిశ్రామికవేత్తలు తనను కలిసి సాదరంగా ఆహ్వానించారని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.