స్టేషన్‌ ఘన్‌పూర్‌లో నేడు సీఎం రేవంత్‌ పర్యటన

60చూసినవారు
స్టేషన్‌ ఘన్‌పూర్‌లో నేడు సీఎం రేవంత్‌ పర్యటన
TG: సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌ఫూర్‌లో పర్యటించనున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లికి చేరుకుని ఇందిర మహిళా శక్తి స్టాళ్లను సందర్శిస్తారు. మహిళా సంఘాలకు 7 ఆర్టీసీ బస్సులను నిర్వహణ నిమిత్తం అప్పగిస్తారు. అనంతరం నియోజకవర్గవ్యాప్తంగా రూ.800 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన ప్రజాపాలన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

సంబంధిత పోస్ట్