నామినేటెడ్ పదవులపై సీఎం కీలక ప్రకటన

70చూసినవారు
నామినేటెడ్ పదవులపై సీఎం కీలక ప్రకటన
త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ శ్రేణులను కలిసిన ఆయన నామినేటెడ్ పదవులపై కీలక ప్రకటన చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పారు. కష్టపడి పని చేసిన వారి లిస్టు తన దగ్గర ఉందన్నారు. పార్టీలో కష్టపడిన వారికి ప్రోత్సాహం ఉంటుందన్నారు. అధికారంలోకి వచ్చామని ఎవరిపైనా కక్ష సాధింపులకు పాల్పడవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్