కులం కారణంగా ప్రేమ విఫలమైందన్న సిఎం

52చూసినవారు
కులం కారణంగా ప్రేమ విఫలమైందన్న సిఎం
కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించానని, అయితే కులాలు వేరు కావడంతో ఆమెను పెళ్లి చేసుకోలేకపోయానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. మైసూరులో బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కులాంతర వివాహాల విషయంపై మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే తాను వివాహం చేసుకుంటానని అడిగినప్పుడు వారి కుటుంబసభ్యులతో పాటు ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్