సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంలో చుక్కెదురు

55చూసినవారు
సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంలో చుక్కెదురు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అరెస్టుపై అత్యవసరంగా విచారించాలంటూ బుధవారం కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని న్యాయస్థానం తాజాగా తిరస్కరించింది. ఈరోజే ఎమర్జెన్సీగా విచారించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. కేసును పరిశీలించి త్వరలోనే ఓ తేదీని ప్రకటిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్‌కు సుప్రీంలో కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

సంబంధిత పోస్ట్