కూలిన గోడ.. నలుగురు మృతి (వీడియో)

572చూసినవారు
హర్యానాలోని గురుగ్రామ్‌ అర్జున్ నగర్ ప్రాంతంలో శనివారం విషాద ఘటన జరిగింది. అకస్మాత్తుగా శ్మశానవాటిక గోడ కూలిపోయింది. ఈ ఘటనలో మైనర్ బాలికతో సహా నలుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. శ్మశానవాటిక నిర్వహణ కమిటీ సభ్యులు పరారీలో ఉన్నారని, వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్