ప్లే ఆఫ్స్‌కు వెళ్తామని నమ్మకముంది: ఆర్సీబీ కోచ్

78చూసినవారు
ప్లే ఆఫ్స్‌కు వెళ్తామని నమ్మకముంది: ఆర్సీబీ కోచ్
తమ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్తుందన్న నమ్మకం ఇంకా ఉందని ఆర్సీబీ హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు గుజరాత్‌తో హోం గ్రౌండ్‌లో మ్యాచ్ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 'మాకు ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇప్పటికి వరసగా రెండు మ్యాచులు గెలిచాం. ఈరోజు కూడా గెలుస్తాం. మా ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఎదురుచూస్తున్నారు. మాకు ఇంకా నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్