మహిళా సాధికారికతలో భాగంగా రాబోయే 12 నెలల్లో లక్ష మంది బీమా సఖిలను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎల్‌ఐసీ సోమవారం తెలిపింది. బీమా సఖిలకు స్టయిఫండ్ నిమిత్తం రూ.840 కోట్ల వరకు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. మారుమూల ప్రాంతాలకూ ఎల్‌ఐసీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ‘బీమా సఖి’ పథకం ఉపయోగపడుతుందని తెలిపింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక బీమా సఖిని నియమించే యోచనలో ఉన్నామని వెల్లడించారు.