యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీఆర్ ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శనివారం బీఆర్‌ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.