రైల్వే స్టేషన్‌లో కూలిన పైకప్పు.. చిక్కుకున్న కూలీలు (వీడియో)

78చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ రైల్వే స్టేషన్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. అక్కడి నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. శిథిలాల కింద కనీసం 20 మంది చిక్కుకుని ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. ఇప్పటివరకు ఆరుగురిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్