భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ విమానాశ్రయానికి 500 ఎకరాల్ని తగ్గించగా.. మళ్లీ ఆ భూమిని తిరిగి కేటాయించే అంశంపై ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఆ 500 ఎకరాల భూమిని తిరిగి విమానాశ్రయానికి కేేటాయించనున్నారు.