అబద్దానికి అంగీ లాగు తొడిగితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలా ఉంటుందని రాష్ట్ర రైతాంగానికి అర్థమైందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేసిన ద్రోహానికి మోసం అనే పదం చాలా చిన్నపదం అని ఫైర్ అయ్యారు. రైతుల పట్ల కాంగ్రెస్ చేసిన దగా అంతా ఇంతా కాదన్నారు. కాంగ్రెస్ చేసిన మోసానికి డిక్షనరీలో కొత్త పదాలు వెతకాలని.. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు, కపట నాటకాలకు ఇది ఒక చీకటి అధ్యాయం అని విమర్శించారు.