విపక్ష నేత ఎవరనేది కాంగ్రెస్ ఇష్టం: శరద్ పవార్

57చూసినవారు
విపక్ష నేత ఎవరనేది కాంగ్రెస్ ఇష్టం: శరద్ పవార్
లోక్‌సభలో విపక్ష నేత నియామకంపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తెలిపారు. ‘ఇండియా కూటమిలో కాంగ్రెస్ 99 సీట్లతో ఎక్కువ స్థానాలు దక్కించుకుని పెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో ఆ పదవి ఎవరికి ఇవ్వాలో కాంగ్రెస్ నిర్ణయిస్తుంది’ అని స్పష్టం చేశారు. కాగా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభలో విపక్ష నేత ఎవరనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్