హైదరాబాద్‌లో సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్​టీపీల నిర్మాణం

72చూసినవారు
హైదరాబాద్‌లో సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్​టీపీల నిర్మాణం
హైదరాబాద్ మహానగరంలో ప్రతి రోజూ ఉత్పత్తయ్యే మురుగును వంద శాతం శుద్ధి చేయడానికి వీలుగా ఎస్​టీపీలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మొత్తం 5 సర్కిళ్లలో ఈ ఎస్​టీపీలను నిర్మిస్తుంది. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్​టీపీల నిర్మాణం జరుగుతోంది. వాటి నిర్మాణం పూర్తై అందుబాటులోకి వస్తే రోజూ ఉత్పన్నమయ్యే మురుగును 100 శాతం శుద్ధి చేసే తొలి నగరంగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ చరిత్ర సృష్టిస్తుందని జలమండలి భావిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్