ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనతోపాటు సంబంధిత పథకాలను కేంద్రం పొడిగించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. 2028 డిసెంబరు వరకు ఉచిత బియ్యం పంపిణీ పథకాలను పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. వీటి కోసం రూ.17,082 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా ఉచితంగా బియ్యం/ఆహార ధాన్యాలు అందించేందుకు ఈ పథకాలను గతంలో కేంద్రం ప్రవేశపెట్టింది.