రెండేళ్లలో 3.67 లక్షల మంది విద్యార్థుల తగ్గుదల

82చూసినవారు
రెండేళ్లలో 3.67 లక్షల మంది విద్యార్థుల తగ్గుదల
తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లలో 3,67,374 మంది విద్యార్థులు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. 2024-25లో 30,137 ప్రభుత్వ పాఠశాలల్లో 25,13,435 మంది విద్యార్థులు చదువుతున్నారు. అదే 11,217 ప్రయివేటు స్కూళ్లలో 37,01,814 మంది విద్యనభ్యసిస్తున్నారు. 2022-23లో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతి వరకు 9,64,128 మంది చదివితే, ప్రస్తుత విద్యాసంవత్సరంలో 7,39,433 మంది చదువుతున్నారు. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్