మోసగాళ్లు ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నారంటే.. అసలు వ్యక్తికి తెలియకుండా, అతని పేరు మీద నకిలీ బ్యాంక్ ఖాతాలు సృష్టిస్తారు. ఈ ఖాతాలు తెరవడానికి చోరీ చేసిన ఐడీలు, ఇతర నకిలీ పత్రాలను ఉపయోగిస్తారు. వీటిలో అక్రమంగా సంపాదించిన నగదును, మనీలాండరింగ్ ద్వారా సంపాదించిన డబ్బును ఉంచుకుంటారు. అంటే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు నకిలీ ఖాతాలను ఉపయోగించుకుంటారు.