21 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు

60చూసినవారు
21 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు
లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో పోటీ చేస్తున్న మొత్తం 866 మంది అభ్యర్థుల్లో 180 మంది (21%) తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో ప్రకటించారని ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. 141 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. 12 మంది తాము దోషులుగా తేలిన కేసులను ప్రకటించగా, ఆరుగురు అభ్యర్థులు తమపై హత్య కేసులున్నట్లు పేర్కొన్నారు. 24 మందిపై మహిళా సంబంధిత నేరాలు, 16 మందిపై విద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్