శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో ఘటన జరిగితే దీనిపై సీఎం రెండు, మూడు గంటల తర్వాత స్పందించారు. తక్షణ చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లికి బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకున్నారనే విమర్శలున్నాయి. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై విమర్శలు వస్తున్నాయి. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా రేవంత్ వ్యవహారం ఉందని కేటీఆర్ ఆరోపించారు.