మనోజ్‌కుమార్, శ్రీనివాస్, కార్మికులు సందీప్సహు, జక్తాజెస్, సంతోష్సాహు, అనూజ్ సాహు , సన్నీ సింగ్, గురుదీప్ సింగ్ సొరంగం లోపల చిక్కుకు పోయారు. వారిని కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారు ఎలా ఉన్నారోనని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 8 మంది ఆచూకీ ఎప్పుడు తెలుస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. వారు అసలు బతికే ఉన్నారా? వారిని ప్రభుత్వం సత్వరం కాపాడాలని కోరుతున్నారు.