నాటు కోళ్ల మాంసం, గుడ్లు ఆరోగ్యానికి ఎంతో బలవర్ధకమైనవి. అందుకే మార్కెట్లో నాటు కోళ్లకు డిమాండ్ బాగా ఉంటుంది. ఈక్రమంలో నాటు కోళ్ల పెంపకం చేపట్టి చిన్న, సన్న కారు రైతులు ఏడాది పొడవునా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. పైగా తక్కువ పెట్టుబడితో అతి కొద్ది కాలంలోనే లాభాలను ఆర్జించవచ్చు. అయితే వాతావరణ పరిస్థితులకు తగిన కోళ్లను ఎంచుకోవాలి. ఇక వనరాజా, గిరిరాజా, రాజశ్రీ, కడకనాథ్, స్వర్ణదార, సోనాలి నాటుకోళ్లలో ముఖ్యమైన రకాలు.