ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మైకేల్ బార్నియర్ (73) ను.. ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ సెప్టెంబర్ 5న నియమించారు. గాబ్రియెల్ అట్టల్ స్థానంలో బార్నియర్ ఎంపికయ్యారు. బార్నియర్ గతంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిగా, పర్యావరణ, వ్యవసాయ శాఖల మంత్రిగా, ఈయూ కమిషనర్‌గా పనిచేశారు. బ్రెగ్జిట్ చర్చల్లో యూరోపియన్ యూనియన్‌కు బార్నియర్ ప్రాతినిధ్యం వహించారు.