అమెరికాలో పౌరసత్వం పొందాలనుకునే విదేశీయులకు నిర్వహించే పరీక్షలో మార్పులు చేయబోతున్నారు. ఇంగ్లీష్ పై పరిజ్ఞానం తక్కువగా ఉండే అభ్యర్థులకు ఇది ఇబ్బందికరంగా మారనుంది. నెలరోజుల పాటు సాగే ఈ పరీక్షలో నెగ్గినవారు మాత్రమే పౌరసత్వం కోసం దరఖాస్తుకు అర్హులు. కొత్త విధానంలో అభ్యర్థులు
అమెరికా వాతావరణం, ఆహారం, డైలీ యాక్టివిటీస్ గురించి వివరించాల్సి ఉంటుంది. కొత్త పరీక్షా విధానం వచ్చే ఏడాది నుంచి అమలులోకి వస్తుంది.