ఫ్రిజ్, టీవీ, 4 ఫ్యాన్లకు రూ.20 లక్షల కరెంట్ బిల్లు.. షాక్ లో కుటుంబం

74చూసినవారు
ఫ్రిజ్, టీవీ, 4 ఫ్యాన్లకు రూ.20 లక్షల కరెంట్ బిల్లు.. షాక్ లో కుటుంబం
గుజరాత్‌ లో ఓ కుటుంబానికి కరెంట్ బిల్లు షాక్ ఇచ్చింది. నవ్‌సారిలో నివసించే ఆ కుటుంబానికి 2 నెలల కరెంట్ బిల్లు రూ. 20,01,902 రావడంతో షాక్ అయింది. తమ ఇంట్లో 4 బల్బులు, 4 ఫ్యాన్లు, ఒక ఫ్రిజ్, ఒక టీవీ ఉన్నాయని, మేము రోజంతా పనిచేసేందుకు బయటకు వెళ్తామని ఇంటి యజమాని పటేల్ చెప్పారు. తాము సకాలంలోనే బిల్లు చెల్లించినా ఇలా లక్షల్లో బిల్లు రావడం బాధ కలిగించిందని అన్నారు. మీటర్ తప్పుడు రీడింగ్ వల్లే ఇలా జరిగిందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్